English | Telugu

జమ్మూకాశ్మీర్ లో శ్రీవారి ఆలయం... టీటీడీ కీలక నిర్ణయం 

ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాల్లో టీటీడీ శ్రీ వారి ఆలయాలను నిర్మించింది. తిరుమల కొండ పై ఉన్న ఆలయాల తరహాలో కాకపోయినా కనీసం ఆ స్థాయిలో అనేక చోట్ల శ్రీవారి ఆలయాలు ఉన్నాయి. ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూకాశ్మీర్ రాష్ట్రం రెండుగా విడిపొయిన నేపధ్యంలో అక్కడ ఉన్న పరిణామాలకు పూర్తిగా వాతావరణం అనుకూలించిన నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ లో కూడా తిరుమల శ్రీ వారి ఆలయం నిర్మించాలన్న ఒక బృహత్తర ఆలోచన టిటిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. తిరుమల ఈవో, జేఈవో అధికారులందరూ కూడా జమ్మూకాశ్మీర్ కి వెల్లనున్నట్లు సమాచారం.

జమ్మూకాశ్మీర్ లో ఎక్కడ ఆలయాని నిర్మిస్తారు అన్న అంశం తేలాల్సి ఉండగా జమ్ములో నిర్మిస్తారా లేక కాశ్మీర్ లో నిర్మిస్తారా లేక అందరికీ అనువుగా శ్రీనగర్ లో నిర్మిస్తారా అనేది తెలియాల్సిన అంశం. మొత్తం మీద టీటీడీ ఇవాళ కీలక నిర్ణయానికి అడుగు వేసే దిశగా ప్రయత్నం చేయబోతున్న నేపధ్యంలో అధికార యంత్రాంగమంతా కూడా ఇంజనీరింగ్ సిబ్బంది కావచ్చు, ప్లానింగ్ సిబ్బంది కావచ్చు అందరూ కూడా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పర్యటించబోతున్నట్లు సమాచారం. ఉగ్రవాద కార్యకలాపాల నుంచి ఉపశమనం కలిగేల ఏయే ప్రాంతాల్లో ఆలయం నిర్మిస్తే అనువుగా ఉంటుంది అనే చూసి ఆ దిశగా అడుగులు వేయనున్నట్లు టీటీడీ వెల్లడిస్తొంది.