English | Telugu
ట్విస్ట్ అదిరింది.. కారు ఖాతాలోకి వెళ్లిన నెరేడుచర్ల మునిసిపాలిటీ
Updated : Jan 28, 2020
సినిమా తరహా ట్విస్ట్ ల మధ్య నేరేడుచర్ల మున్సిపాలిటీ టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లిపోయింది. చివరి నిమిషంలో శేరి సుభాష్ రెడ్డిని వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ రంగంలోకి దించడంతో బలాబలాలు తారుమారైపోయాయి. నిన్నటి దాకా కాంగ్రెస్, టిఆర్ఎస్ బలం సమంగా ఉండింది. ఎక్స్ అఫిషియో సభ్యునిగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శైలి సుభాష్ రెడ్డి పేరుని అదనంగా కలపడంతో టిఆర్ఎస్ బలం 11 కు చేరింది. దీంతో మున్సిపల్ చైర్మన్ పీఠం టిఆర్ఎస్ ఖాతాలోకే వెళ్లింది.
ఈ రోజు ఉదయం నుండి నేరేడుచర్ల మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలలో కొంత ఉత్కంఠ నెలకొంది. సమావేశం ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ సభ్యులు ఉన్న ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నిక జరగాలని డిమాండ్ చేశారు. కొత్తగా సుభాష్ రెడ్డి ఎమ్మెల్సీ పేరును చేర్చడం సరైంది కాదని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే సుభాష్ రెడ్డి ఓటు నమోదు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో తాము ఆత్మహత్య చేసుకుంటామని కూడా కాంగ్రెస్ సభ్యులు బెదిరింపులకు పాల్పడ్డారు.