English | Telugu
మంత్రి అనిల్‌కు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన అనురాధ
Updated : Oct 16, 2020
నిర్మించే విజనరీ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుది అని.. పడగొట్టే ప్రిజనరీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది అని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. చంద్రబాబు నిర్మించిన సైబరాబాద్, అమరావతి.. వరదలకు మునగలేదనే విషయం అనిల్ గుర్తుపెట్టుకోవాలని ఒకింత కౌంటరిచ్చారు. జగన్ రెడ్డి దరిద్ర పాదం వల్ల రాష్ట్రం 17 నెలలుగా వణికిపోతోందని చెప్పుకొచ్చారు. వరదలు వచ్చినా సాగునీరు ఇవ్వలేని మంత్రి అనిల్.. నీటి పారుదలశాఖకి రాజీనామా చేసి నోటి పారుదలశాఖ తీసుకోవాలని అనురాధ సూచించారు.
కాగా.. కొద్దిసేపటి క్రితం మంత్రి మాట్లాడుతూ కృష్ణానదికి ప్రమాదకర స్థాయిలో వరద వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు కరకట్టపై నిర్మించిన అక్రమ నివాసాన్ని వదిలివెళ్లాలని మాట్లాడారు. మంత్రి వ్యాఖ్యలపై అనురాధ స్పందిస్తూ పై విధంగా కౌంటరిచ్చారు.