English | Telugu
రైతుల పోరాటానికి భారీ మద్దతు! ప్రశాంతంగా భారత్ బంద్
Updated : Dec 7, 2020
బంద్ సందర్భంగా నిలిచిపోయిన ప్రయాణికులకు మంచినీరు, పండ్లను ఇస్తున్నారు నిరసనకారులు. ఢిల్లీ సరిహద్దుల్లో 13వ రోజు రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతులు చలిని సైతం లెక్క చేయకుండా రోడ్లపై భైఠాయించారు. పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఢిల్లీ సరిహద్దులకు రైతులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. రైతుల ఆందోళనతో సింఘు, టిక్రి, జారోదా, ఘజిపూర్, చల్లా, నోయిడా లింక్ రోడ్డు, జటిక్రా సరిహద్దు రహదారులను పోలీసులు మూసివేశారు. హరియనా, నోయిడా నుంచి ఢిల్లీ వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. సరిహద్దుల్లో భారీగా కేంద్ర బలగాల మోహరించాయి. ఇప్పటికే ఐదు సార్లు చర్చలు జరిపినా రైతులు పట్టువీడలేదు. బుధవారం మరోసారి రైతు సంఘాల నాయకులతో కేంద్రం చర్చలు జరపనుంది.