English | Telugu

మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా

ఏపీలో ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొందరు కరోనా బారినపడ్డారు. తాజాగా, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి కూడా కరోనా పాజిటివ్‌ గా నిర్థారణ అయింది. కరోనా అనుమానంతో ఆయన ఇటీవల పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ గా తేలింది. ఆయన సతీమణి శ్రీవాణిరెడ్డికి కూడా కరోనా సోకింది. ప్రస్తుతం వీరు తిరుపతి అమర ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ రావటంతో ఆయనను కలిసిన నేతలు, కార్యకర్తలు, సన్నిహితుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం అధికారులు ఎమ్మెల్యేను కలిసిన వారిని ట్రేస్ చేసే పనిలో పడ్డారు. శ్రీకాళహస్తి వైసీపీ కార్యాలయంలోని సిబ్బంది, ఆ ప్రాంతంలోని పలువురు కార్యకర్తల నుంచి కరోనా పరీక్షల కోసం వైద్య సిబ్బంది నమూనాలు సేకరిస్తున్నారు.