English | Telugu
18 ఏళ్ల క్రితం సలహా ఇచ్చిన అభిమానిని వెతికిపట్టుకున్న సచిన్
Updated : Dec 17, 2019
నెటిజన్ల సాయంతో ఎట్టకేలకు సచిన్ టెండూల్కర్ తన అభిమానిని కలుసుకున్నాడు. సరిగ్గా 18 ఏళ్ల కిందట పరిచయమైన ఓ అభిమానిని మళ్లీ కలుసుకున్నాడు. చెన్నైలోని తాజ్ కోరమాండల్ హోటల్లో ఓ అభిమానిని కలిశానని.. అతను ఇచ్చిన సలహా మేరకు నా మోచేతి గార్డ్ లో మార్పులు చేసుకోవడంతో నా ఆట చాలా మెరుగైంది అంటూ పాత జ్ఞాపకాలను పంచుకున్నాడు సచిన్ టెండూల్కర్. అయితే అతను ప్రస్తుతం ఎక్కడున్నాడో తెలియదని.. ఎవరికైనా తెలిస్తే అడ్రస్ ఇవ్వాలంటూ.. సోషల్ మీడియాలో రిక్వెస్ట్ పెట్టాడు. మాస్టర్ బ్లాస్టర్ నోరు తెరిచి అడిగిన తర్వాత ఇక నెటిజన్లు ఆగుతారా కొన్ని గంటల్లోనే అతడు ఎక్కడున్నాడో వెతికి పట్టేశారు. అతని అడ్రస్ ను సచిన్ కు పోస్ట్ చేశారు.
సరిగ్గా 18 ఏళ్ల కిందట ఓ మ్యాచ్ కోసం స్టార్ హోటల్లో బస చేసిన సచిన్ ను ఆ హోటల్లో వెయిటర్ గా పని చేస్తున్న గురు ప్రసాద్ అభిమానిగా పరిచయం చేసుకున్నాడు. సార్ మీరేం అనుకోనంటే క్రికెట్ కు సంబంధించి ఓ సూచన చేయొచ్చా అని అడిగాడు. దానికి సచిన్ ఓకే చెప్పడంతో మీ మోచేతి గార్డు వల్ల బ్యాటింగ్ సమయంలో అసౌకర్యానికి గురవుతున్నారు అని గురు ప్రసాద్ అసలు విషయం చెప్పాడు. ఓ అభిమాని తన బ్యాటింగ్ ను అంత తీక్షణంగా గమనిస్తూ ఉండటం చూసి లిటిల్ మాస్టర్ ఆశ్చర్యపోయాడు. అభిమాని సూచన మేరకు మోచేతి గార్డ్ సైజును సచిన్ మార్చుకున్నాడు. దీంతో సచిన్ మణికట్టు కదలికల సులువు అయ్యాయి. ఆటతీరు కూడా మెరుగైంది. అయితే ఆ విషయం ఇపుడు సడన్ గా ఎందుకు గుర్తుకు రావడంతో సోషల్ మీడియాలో పాత ఫొటో పెట్టి వెతికి పట్టాలనీ రిక్వెస్ట్ పెట్టాడు సచిన్. లిటిల్ మాస్టర్ ట్వీట్ తో ఒకప్పుడు స్టార్ హోటల్లో పని చేసిన గురు ప్రసాద్ ఒక్క సారిగా పాపులర్ అయిపోయాడు. మొదటి సారి సచిన్ ను కలిసినప్పుడు ఇలా ఉన్న గురు ప్రసాద్ పద్దెనిమిదేళ్ళ తర్వాత నలభై ఆరేళ్ల వయసు పైబడే సరికి ఇదిగో ఇలా అయ్యాడు. అయితే తన సాయాన్ని సచిన్ ఇప్పటికీ గుర్తుపెట్టుకోవటానికి అభినందించారు గురు ప్రసాద్.