English | Telugu
రాజస్థాన్ పాలిటిక్స్ లో మేజర్ ట్విస్ట్.. రాహుల్‌తో సమావేశమైన సచిన్ పైలట్
Updated : Aug 10, 2020
ఈ రోజు మధ్యాహ్నం సచిన్ పైలట్ రాహుల్ గాంధీ నివాసంలో రాహుల్, ప్రియాంక లను కలిసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ భేటీ నేపథ్యంలో ఏ క్షణమైనా రాజస్థాన్ లో కీచులాడుకుంటున్న కాంగ్రెస్ నాయకుల మధ్య రాజీ కుదిరే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు సూచిస్తున్నాయి.
కొద్ది రోజుల క్రితం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం పై తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్ ను ఉప ముఖ్య మంత్రి పదవి నుండి తప్పించిన సంగతి తెలిసిందే. దీంతో రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఈ నెల 14న శాసనసభలో విశ్వాస పరీక్ష జరగనున్న నేపథ్యంలో సచిన్ పైలట్ రాహుల్ భేటీతో బహుశా గెహ్లాట్ సర్కార్ గట్టెక్క వచ్చు.