English | Telugu
యనమల, చినరాజప్పలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు
Updated : Jun 13, 2020
తన భర్తకు రెండో పెళ్లి చేయడానికి ప్రయత్నించారని.. కొందరు తనను బెదిరించారని మంజు ప్రియ అనే మహిళ ఫిర్యాదు చేసింది. తన భర్త పిల్లి రాధాకృష్ణ కు అతని తల్లిదండ్రులైన పిల్లి అనంతక్ష్మి, పిల్లి సత్యనారాయణలు రెండో పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్నారని దీనికి మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప లు ఒత్తాసు పలికారని ఆమె ఆరోపించింది. దీనితో వీరందరిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
2011లో పిల్లి రాధాకృష్ణ ను ప్రేమ వివాహం చేసుకున్నట్లు బాధితురాలు చెబుతోంది. అయితే రెండు రోజుల క్రితం మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్వగ్రామంలో రాధాకృష్ణ రెండో వివాహం జరిపించేందుకు ప్రయత్నించారని, దీనికి పెళ్లి పెద్దలుగా మాజీ మంత్రులు యనమల, చినరాజప్పలు హాజరయ్యారని బాధితురాలు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆ వివాహాన్ని అడ్డుకుని పెళ్లికి హాజరైన మాజీ మంత్రులపై కూడా కేసు నమోదు చేశారు.