English | Telugu
యూపీలో రాహుల్ గాంధీ అరెస్ట్.. పరిస్థితి ఉద్రిక్తం
Updated : Oct 1, 2020
అయితే తన పట్ల యూపీ పోలీసులు వ్యవహరించి తీరును రాహుల్ తీవ్రంగా ఖండించారు. తనను నెట్టివేశారని.. లాఠీచార్జ్ కూడా చేశారని అయన మండిపడ్డారు. తనను తోసివేసి కింద పడేసినట్లు రాహుల్ ఆరోపించారు. అయితే హత్రాస్ తానొక్కడినే వెళ్లాలని అనుకుంటున్నాని.. తనను ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అయితే రాహుల్ గాంధీ నిబంధనలను అతిక్రమించింనందుకుగాను ఐపీసీ 188 సెక్షన్ కింద అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. దీంతో యూపీ ప్రభుత్వం తీరుపై రాహుల్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని మోదీ మాత్రమే ఈ దేశంలో నడుస్తారా.. ఓ సాధారణ వ్యక్తి కనీసం నడవలేరా అని ఆయన నిలదీశారు. ఈ ఘర్షణలో కిందపడిన అన్నను కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పరామర్శించారు. తనను కూడా పోలీసులు నెట్టివేశారంటూ ఆమె ఆరోపించారు.