English | Telugu

ఆర్టీసి సంఘాల్లో ఆతృతను నింపిన సిఎం కెసీఅర్ సమీక్ష...

తెలంగాణ హై కోర్టు ఉత్తర్వుల కాపీ ప్రభుత్వానికి అందిన నేపథ్యంలో సీఎం కే సీ ఆర్ సమీక్ష ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ధర్మాసనం ఆదేశాల నేపథ్యంలో ఏం చేయాలన్నది నిర్ణయించనుంది ప్రభుత్వం. ఇప్పటికే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఉన్నతాధికారులు ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ఒకవేళ చర్చలు జరిగితే ఎవరి ఆధ్వర్యంలో ముందుకు వెళ్ళాలి అనేది కూడా ప్రభుత్వం తేల్చబోతోంది.


హై కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ కాపీలో పన్నెండు అంశాలు సులువైనవిగా, ఆర్ధికంగా భారం లేనటువంటివి ఉన్న నేపథ్యంలో చర్చలు సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చర్చల్లో సునీల్ శర్మ ఆర్టీసికి సంబంధించిన ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ లు పాల్గొంటున్నారు. ఈ చర్చల్లో హై కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ కాపీలో ఉన్న పన్నెండు అంశాలే కాక కార్మిక సంఘాలు ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్ ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది ముందుకు తీసుకువస్తే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఇప్పుడు అందరూ ఆతృతగా చుస్తున్నారు.


ఒకవైపు కోర్టు ఇచ్చిన తీర్పును ఖచ్చితంగా ప్రభుత్వం పాటించాల్సి ఉంటుంది మరోవైపు కార్మిక సంఘాలకు కూడా సర్ధి చెప్పాలి ఈ రెండిటి నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎవరెవరిని చర్చలకు పంపాలి అనే అంశాల పై ముఖ్యమంత్రి ఇప్పుడు సమీక్ష జరపనున్నారు. సమీక్ష తరువాత హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని అంశాలపై చర్చించి, అవి ఎంతవరకు సాధ్యమవుతాయి అనే దానిపై మరల ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కె సీ ఆర్ సమీక్ష ప్రాధాన్యత సంతరించుకుంది.