English | Telugu

విజయసాయి లేఖతో ఆ బీజేపీ ఎంపీపై విచారణ!!

మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి పెద్ద షాక్ తగిలింది. సుజనా చౌదరిపై ఉన్న ఆర్ధిక నేర ఆరోపణలపై ఈడీ, సీబీఐలతో విచారణ చేయించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పందించారు. ఫిర్యాదును పరిశీలించాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కేంద్ర హోంశాఖను ఆదేశించారు. సుజనా చౌదరి ఆర్ధిక నేర ఆరోపణలపై, అక్రమ కంపెనీలు, మనీ లాండరింగ్‌ వ్యవహారాలపై విచారణ జరపాలని రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. దీనిపై రాష్ట్రపతి కార్యాలయం నుంచి విజయసాయి రెడ్డికి బదులిస్తూ లేఖ వచ్చింది. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి, విచారణ జరుపుతామని ఊహాగానాలు మొదలయ్యాయి.