English | Telugu
జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు
Updated : Nov 7, 2020
పోలీస్ అధికారుల ముఖ్యమైన విధులు శాంతిభద్రతలు కాపాడుతూ స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడటం అన్నారు. ఎన్నికల సమయంలో లైసెన్స్ లేని ఆయుధాలు సీజ్ చేయాలని, లైసెన్స్ ఆయుధాలు కలిగినవారు తమ ఆయుధాలు ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు సంబంధిత పోలిస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాలని, బీట్ పెట్రోలింగ్ పెంచాలని, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిని చట్టప్రకారం శిక్షించాలని అన్నారు.
రెవిన్యూ మరియు మున్సిపల్ అధికారులతో కలిసి సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయిన రోజు నుండి మున్సిపల్ సర్కిల్ లలో పరిస్థితులను బట్టి తగినన్ని స్టాటిక్ సర్వేలేన్స్ టీములు, ఫ్లైయింగ్ స్క్వాడ్ లు, చెక్ పోస్టులు, పోలీస్ పికెట్ లు ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ప్లాన్ తయారు చేయాలని, సమస్యలు సృష్టించే అరాచక శక్తులపై 24 గంటలు నిఘా పెట్టాలని, ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు వెంటనే స్పందించాలని, రౌడీ మూకలు చెలరేగకుండా చూడాలన్నారు. మోడల్ కోడ్ ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని, వాహనాలు, లౌడ్ స్పీకర్ల వాడకం, పోలింగ్ కు 48 గంటల ముందు ప్రచారం నిలిపివేయడం, లిక్కర్ షాపులు మూసివేయడం వంటి సూచనలు విధిగా అమలయ్యేలా చూడాలన్నారు.
ఎన్నికల ఫిర్యాదులు, వాటి పరిష్కారానికి ఒక మెకానిజం తయారు చేసుకొని, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సిబ్బందికి సామాగ్రి పంపిణీ చేసే డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ సెంటర్లవద్ద తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలింగ్ రోజున అల్లరి మూకలను అదుపు చేయడానికి తగినన్ని స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా, ఎప్పటికప్పుడు సానిటైజర్తో చేతులు శుభ్రపరుచుకొనేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో పొలీస్ అధికారులతో సమన్వయ పరచుకోవడానికి ప్రత్యేక విభాగాన్ని నోడల్ ఆఫీసర్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ అధికారులు సంబంధిత జిహెచ్ఎంసి అధికారులతో సంప్రదించి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటామని, ఎటువంటి వివక్ష లేకుండా పారదర్శకంగా శాంతి భద్రతలు కాపాడుతూ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సజావుగా జరుగునట్లు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశానికి జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ. సజ్జనార్, రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్, అడిషనల్ డిజీపి (శాంతి భద్రతలు) జితేంద్ర, సూపరింటె౦డెంట్ ఆఫ్ పోలీస్, సంగారెడ్డి, ఇతర పోలిస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.