English | Telugu
కిలో ప్లాస్టిక్ కి ఒక మొక్క ఒక సంచి ఎక్కడ??
Updated : Oct 2, 2019
మంగళవారం బొంగైగావ్ పట్టణంలోని గాంధీ మైదానంలో 1,000 మందికి పైగ ఒక మొక్క, ఒక వస్త్ర సంచి కోసం ఒక కిలో ప్లాస్టిక్‌ను ఇచ్చారు. బొంగాగావ్ జిల్లా ప్రధాన కార్యాలయం బొంగాగావ్ గువహతికి పశ్చిమాన 180 కిలోమీటర్ల దూరంలో ఉంది.70 ఏళ్ల వయసున్న రేణుకా రాయ్ చౌదరి అందరికంటే ముందుగా తన ఇంటి నుండి ప్లాస్టిక్‌ను బొంగైగావ్ మునిసిపల్ బోర్డు ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ బ్యాంకులో జమ చేయచేసింది. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని తొలగించడంలో పాత తరాలు ముందడుగు వేయాలి అనే సందేశాన్ని ఈ సందర్భంగా ఆమె తెలిపింది.
“సోషల్ ఫారెస్ట్రీ నర్సరీలలో మాకు తగినంత మొక్కలు ఉన్నాయి, కాని 'ప్లాంట్స్ ఫర్ ప్లాస్టిక్' మార్పిడి కార్యక్రమం కోసం కేవలం 200 మొక్కలు మాత్రమే తీసుకువచ్చారు. కాని ప్రజల స్పందన చూశాక మేము చాలా తక్కువ మోతాదులో మొక్కలు తీసుకువచ్చామని మాకు అర్థమైంది ”అని జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆదిల్ ఖాన్ అన్నారు.
శ్రీమతి చౌదరి మరియు మరో 199 మందికి గూస్బెర్రీ, ఆలివ్, మామిడి, జాక్‌ఫ్రూట్, మహోగని మరియు ఇతర స్థానిక జాతుల చెట్ల మొక్కలను మొత్తం 200 కిలోల ప్లాస్టిక్ జమ చేసినందుకు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి స్థానిక మహిళల స్వయం సహాయక బృందాలు తయారుచేసిన వస్త్ర సంచి కూడా లభించింది. ఈ సంచులలో ప్రతి 2 కిలోల కంటే ఎక్కువ బరువును తట్టుకోగలవు.
మంగళవారం మొక్కలు అందని వారికి తరువాత ఒకదాన్ని అందిస్తామని మిస్టర్ ఖాన్ చెప్పారు. "పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది లేకుండా పోయెంత వరకు మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాము. మున్సిపల్ బోర్డ్ కార్యాలయంలో ఎవరికైనా ఒక కిలో ప్లాస్టిక్ జమ చేసి, ప్రతిఫలంగా ఒక మొక్కను పొందటానికి ప్లాస్టిక్ బ్యాంక్ తెరవబడుతుంది ”అని ఆయన అన్నారు.