English | Telugu

భర్తతో కలిసి కన్న కొడుకుని కిరాతకంగా చంపిన కన్న తల్లి 

వరంగల్ జిల్లాలో ఓ వ్యక్తి సజీవ దహనం కేసు ఊహించని మలుపులు తిరుగుతుంది. తొలుత కొడుకు వేధింపులు భరించలేక తల్లిదండ్రులు ఈ దారుణానికి పాల్పడ్డారని అందరూ భావించారు. అయితే పోలీసుల రాకతో అసలు నిజాలు బయటికొస్తున్నాయి. ఆస్తి తగాదాల్లో కన్న కొడుకును తల్లిదండ్రులు అతి కిరాతకం గా చంపారని తేలింది. వరంగల్ రూరల్ జిల్లా దామర మండలం ముస్తాల పల్లిలో జరిగిందీ ఘటన.

కొడాలి ప్రభాకర్ వేములమ్మ దంపతుల కుమారుడు మహేష్ చంద్ర. ఇతనికి రజితతో పెళ్లయింది, కొడుకు కూతురు ఉన్నారు. మహేష్ చంద్ర వరంగల్ వ్యవసాయ మార్కెట్ లో గుమస్తాగా పని చేస్తున్నాడు. అయితే మంగళవారం రాత్రి కుటుంబ కలహాలతో మహేష్ చంద్ర కళ్లల్లో కారం కొట్టిన తల్లిదండ్రులు కర్రతో అతడి పై దాడి చేశారు. మహేష్ తప్పించుకోవడానికి వీలులేకుండా రెండు చేతులు కట్టివేసి కిరోసిన్ పోసి తగులబెట్టారు. మహేష్ పై దాడి జరుగుతున్న క్రమంలో స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారి పై కూడా ప్రభాకర్ , వేములమ్మ దాడికి దిగారు. వేములమ్మ , ప్రభాకర్ పై ముస్తా పల్లి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి కోసం కొడుకును అత్యంత కిరాతకంగా హత్య చేసిన తల్లిదండ్రులను గ్రామం నుంచి బహిష్కరించాలని నిర్ణయించారు. వరంగల్ రూరల్ జిల్లా ముస్తాల్యపల్లి లో మహేశ్ చంద్ర సజీవ దహనం ఘటన పై అతని భార్యాపిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు. తన అత్తమామలే మహేష్ చంద్రను సజీవ దహనం చేశారని అతని భార్య రజిత ఆరోపించారు. కుటుంబ ఆస్తి వివాదంలో పెద్దల పంచాయతీలో ఇచ్చిన తీర్పు తన అత్తకు నచ్చలేదని రజిత చెప్పారు.