English | Telugu

పిఎంసీ ఖాతాదారులకు సుప్రీం కోర్టులో చుక్కెదురు...

పీ ఎం సీ బ్యాంక్ ఖాతాదారులకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది, బ్యాంకు వితడ్రాలపై రిజర్వ్ బ్యాంక్ విధించిన ఆంక్షలను సవరించాలంటూ దాఖలైన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. పీ ఎం సీ లో నాలుగు వేల మూడు వందల యాభై ఐదు కోట్ల భారీ స్కామ్ జరిగినట్టు ఇటీవల బయటపడింది.


దాంతో ఆరు నెలలకు నలభై వేల రూపాయలకు మించి నగదు విత్ డ్రా చేసుకోకుండా ఆర్ బీ ఐ పరిమితులు విధించింది. దాంతో అవసరాలకు తమ డబ్బు బ్యాంక్ నుంచి ఎలా తీసుకోవాలో తెలియక ఖాతాదారులు ఆందోళనకు గురవుతున్నారు. తీవ్ర మనోవేదనకు గురి కావడంతో ఖాతాదారుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకోగా మరో ఇద్దరు గుండె పోటుతో మరణించారు. ఈ నేపథ్యం లో బి ఎస్ కుమార్ మిత్ర అనే ఖాతాదారుడు పరిమితిని ఎత్తివేసేలా ఆదేశాలు ఇవ్వాలి అంటూ సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు.
ఐదు వందల ఖాతాదారుల తరపున తాను పిటిషన్ వేస్తున్నట్లు సుప్రీం కోర్టు కు తెలిపారు. అయితే ఈ పిటిషన్ ను తాము ఆమోదించలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఊరట కోసం ఖాతాదారులు హైకోర్టు ను ఆశ్రయించవచ్చని సూచించింది. దీనిపై ఓ లాయర్ మాట్లాడుతూ ఎన్ని నియమాలు ఉన్నా సరే సుప్రీం తిరస్కరించినా తమ డబ్బు భద్రంగానే ఉంటుందని అన్నారు.