English | Telugu
రూ.50 వేల కోట్లతో కొత్త పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
Updated : Jun 20, 2020
ఇప్పటివరకూ పట్టణాల పురోగతి కోసం పాటు పడిన వలస కార్మికులు.. ఇక నుంచి తమ ప్రాంతాన్ని ప్రగతి పథంలో నిలపాలని మోడీ ఆకాంక్షించారు. పల్లె ప్రాంతాల్లో నివసిస్తోన్న శ్రామికులైన మన సోదర సోదరీమణులకు ఈ పథకాన్ని అంకితం చేస్తున్నానని మోడీ తెలిపారు. ప్రభుత్వ కాంట్రాక్టు పనుల ద్వారా మౌలిక వసతులను అభివృద్ధి పరచాలని నిర్ణయించామని, ఇందుకు రూ. 50 వేల కోట్లను ఖర్చు చేస్తామని మోడీ వెల్లడించారు. ఆరు రాష్ట్రాల్లోని 116 జిల్లాలో ఈ పథకం అమలవుతుందన్నారు. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాలలో వలస కూలీలు ఎక్కువగా ఉన్నారు. వీరికి ప్రయోజనం చేకూర్చేలా ‘గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ యోజన’ ఉంటుంది.