English | Telugu
ఏపీలోతల్లి కాంగ్రెస్’తో పిల్ల కాంగ్రెస్ పొత్తు.. పీకే ప్లాన్ ..
Updated : Apr 22, 2022
ఇదలా ఉంటే, ఇప్పటికే తెరాస నుంచి తృణమూల్ వరకు ఓ అరడజనుకు పైగా పార్టీలతో డీల్ కుదుర్చుకున్న పీకే, ఫైనల్’గా కాంగ్రెస్ పార్టీలో చేరాలనే నిర్ణయానికి వచ్చారు. కాంగ్రెస్ అద్యక్షరాలు సోనియా గాంధీ, ఇతర నాయకులతో వరస భేటీలు నిర్వహిస్తున్నారు. గత ఐదారు రోజుల్లో మూడు మీటింగులు జరిగాయి. అంతే కాదు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి పీకే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనేక సూచనలు చేశారు. ఆయన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, సూచనలఫై ప్రియంక వాద్రా సారధ్యంలోని కాంగ్రెస్ బృందం అధ్యయనం చేస్తోంది. ఈ కమిటీ రేపోమాపో నివేదిక ఇస్తుంది. ఇక ఆ తర్వాత పీకీ కాంగ్రెస్లో చేరతారని తెలుస్తోంది.
అదలా ఉంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి పీకే చేసిన సూచనలలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయాలని.. ఆంధ్రప్రదేశ్‌లో వైకాపాతో జట్టు కట్టాలని సూచించినట్లు తెలుస్తోంది. అలాగే, తమిళనాడులో డీఎంకేతో, మహారాష్ట్రలో ఎన్సీపీతో, పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌తో, ఝార్ఖండ్‌లో జేఎంఎంతో కలిసి వెళ్లడం మేలని ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదించారు. జమ్మూ-కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్, ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడి భాగస్వామ్య పక్షాలతో కలిసి వెళ్లాలని సూచించారు. ఈ పార్టీలన్నీ 2019 ఎన్నికల్లో 128 స్థానాల్లో విజయం సాధించగా.. మరో 249 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచినట్లు ప్రశాంత్ కిశోర్ ఉటంకించారు. మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన సీట్లన్నీ కలిపితే 377 అవుతాయని, వచ్చే ఎన్నికల్లో వీటిపై దృష్టి సారిస్తే భారీగా పుంజుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బీజేపీతో ముఖాముఖి తలపడే రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీచేసి, మిగిలిన చోట్ల 5-6 పార్టీలతో వ్యూహాత్మక పొత్తులు పెట్టుకుంటే పార్టీ విజయావకాశాలు గణనీయంగా మెరుగవుతాయని ప్రతిపాదించారు.అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు కూడా చేపట్టాలని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. ఇందుకుగాను రెండు రకాల ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది.
అయితే తెలుగు రాష్ట్రాలకు సమబందించి పీకే చేసిన సూచన విషయంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు విభిన్నంగా స్పదిస్తున్నాయి.
ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్’లో అధికారంలో ఉన్న వైసీపీ అయితే, ఎన్నికలకు ఇంకా రెండేళ్ళు సమయం ఉందని, కాబట్టి పీకే ప్రతిపాదనపై ఇప్పుడే స్పందించవలసిన వసరం లేదని,అంటున్నారు. అలాగే, ఇప్పటికిప్పుడు పొత్తుల విషయంలో నిర్ణయం తీసుకుంటే, కేసుల ఉచ్చులు బిగుసుకుంటాయనే భయం కూడా వైసీపీ నాయకులు వ్యక్తపరుస్తున్నారు.నిజానికి, పీకే మొదటి నుంచి కూడా పిల్ల కాంగ్రెస్ పార్టీలు అన్నింటినీ తల్లి కాంగ్రెస్ గూటికి చేర్చే ఆలోచనతోనే పావులు కదుపుతున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం వలన ఏపీలో వైసీపీకి, బెంగాల్’లో తృణమూల్’కు అదనంగా వచ్చే ప్రయోజనం ఏముంటుంది, అనే ప్రశ్న కూడా వుంది. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే టికెట్ల విషయంలో కొత్త చిక్కులు వస్తాయని,వైసీపీ నాయకులు అంటున్నా