English | Telugu

బాణాసంచా అమ్మకం, కాల్చ‌డంపై నిషేధం పొడిగింపు

బాణాసంచా అమ్మ‌కం, కాల్చ‌డంపై కొనసాగుతున్న నిషేధాన్ని నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ (ఎన్‌జీటీ) మ‌రి కొంత కాలం పొడిగించింది. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని నేష‌న‌ల్ క్యాపిట‌ల్ రీజియ‌న్(ఢిల్లీ, ప‌రిస‌ర ప్రాంతాలు) తోపాటు, కాలుష్యం స్థాయి ఎక్కువగా ఉన్న అన్ని న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌కు ఈ నిషేధం వ‌ర్తిస్తుంద‌ని ఎన్‌జీటీ స్పష్టం చేసింది. ఓ వైపు కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే, మరోవైపు బాణాసంచా దానికి ఆజ్యం పోస్తోందని ఎన్‌జీటీ వ్యాఖ్యానించింది. కరోనా మహమ్మారి పోయేంత వరకు బాణాసంచా కాల్పులపై నిషేధం ఉంటుందని ఎన్‌జీటీ స్పష్టం చేసింది.

కాగా, ఇటీవల దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో పెద్ద ఎత్తున బాణాసంచాకాల్చారు. అసలే కాలుష్య కోరల్లో చిక్కుకునివున్న ఢిల్లీలో.. బాణాసంచా కాల్చడంతో కాలుష్యం పెరిగిపోయింది. పైగా, కరోనా వైరస్ వ్యాప్తి పెరిగి కేసులు మళ్లీ విజృంభించాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ఎన్జీటీ.. నేష‌న‌ల్ క్యాపిట‌ల్ రీజియ‌న్ తోపాటు గాలి నాణ్యత తక్కువగా ఉన్న అన్ని నగరాలు, పట్టణాల్లో బాణాసంచా అమ్మకం, కాల్చ‌డంపై కరోనా ప్రభావం తగ్గే వరకు నిషేధం విధించింది.