English | Telugu
మోడీతో చేతులు కలిపి సిగ్గుపడ్డాను! ఒబామా పేరుతో నకిలీ ట్వీట్ వైరల్
Updated : Dec 9, 2020
నరేంద్ర మోడీ, బారక్ ఒబామా ఇద్దరూ కలిసిన వేళ, షేక్ హ్యాండ్ ఇచ్చుకోగా, ఆ ఫోటోను పోస్ట్ చేస్తూ "ఈ మనిషితో నేను ఇవాళ షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి రావడం చాలా సిగ్గుచేటు" అని ఒబామా వ్యాఖ్యానించినట్టు ఆ ట్వీట్ కనిపిస్తోంది.. ఈ పోస్ట్ వైరల్ కాగానే దీనిలో ఎంత నిజముందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. తర్వాత ఈ ట్వీట్ ను ఫేక్ ట్వీట్ గా తేల్చారు. నరేంద్ర మోడీ గురించి ఒబామా ఎన్నడూ అలా మాట్లాడలేదని ట్విట్టర్ 'అడ్వాన్డ్స్ రీసెర్చ్' సెట్టింగ్స్ ను వాడి కనిపెట్టారు. టైమ్స్ ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా దీన్నే నిర్ధారించింది. ఒకవేళ ఒబామా ఆ వ్యాఖ్యలు నిజంగా చేసివుంటే అది అంతర్జాతీయ వార్తగా మారి ఉండేదని, దీన్ని చూడగానే ఇది ఫేక్ ట్వీట్ అనే భావించామని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు.