English | Telugu
మహిళల టీ20 ప్రపంచకప్.. సెమీస్ చేరిన భారత్
Updated : Feb 27, 2020
మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా అదరగొట్టింది. హ్యాట్రిక్ విజయాలతో సెమీఫైనల్‌కి అర్హత సాధించింది. మెల్బోర్న్లో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో లీగ్ టీ20లో 4 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి సెమీస్‌కు చేరింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 134 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందుంచింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 129 పరుగులు మాత్రమే సాధించింది. దీంతో 4 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 46 పరుగులు చేసి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించిన షెఫాలీ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.