English | Telugu

అమిత్‌షాకు క‌రోనా నెగెటివ్

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని వెల్లడించారు. ఈశ్వరుడి దయ వల్ల కరోనా నుంచి బయటపడ్డానని అన్నారు. తనకు చికిత్స అందించిన మేదాంత హాస్పిటల్ డాక్టర్లకు, మెడికల్ సిబ్బందికి ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. అలాగే, తాను కరోనా నుంచి కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. అయితే, వైద్యుల సలహా మేరకు మరి కొన్ని రోజులు హోం ఐసొలేషన్ లో ఉంటానని చెప్పారు.

55 ఏళ్ల అమిత్ షా రెండు వారాల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆగ‌స్టు 2న ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్టు అమిత్‌ షా స్వ‌యంగా ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌టించారు. వైద్యుల స‌ల‌హా మేర‌కు ఆస్ప‌త్రిలో చేరుతున్న‌ట్టు తెలిపారు. త‌న‌తో స‌న్నిహితంగా మెలిగిన‌వారు క్వారంటైన్‌లో ఉండాల‌ని, ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే క‌రోనా పరీక్షలు చేయించుకోవాల‌ని సూచించారు.