English | Telugu

సీఎంని త‌ప్పుగా చూపించ‌డానికి పెద్ద కుట్ర.. హీరో రామ్ సంచలన ట్వీట్లు

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనపై టాలీవుడ్ హీరో రామ్ పోతినేని స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన రామ్.. దీని వెనుక పెద్ద కుట్ర జ‌రుగుతున్న‌ట్టుంది అని అనుమానం వ్యక్తం చేశారు.

"హోటల్ స్వర్ణ ప్యాలస్ ని రమేష్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్ గా మార్చక ముందు, ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడీ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు?" అని రామ్ ప్రశ్నించారు.

"ఫైర్ + ఫీజు ‌= ఫూల్స్" అంటూ మరో ట్వీట్ చేశారు. అంద‌రినీ ఫూల్స్ చేయ‌డానికే విష‌యాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మ‌ళ్లిస్తున్నారా? అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మేనేజ్‌మెంట్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్న స్వ‌ర్ణ‌ప్యాలెస్‌ డైరెక్ట్ గా బిల్లింగ్ చేసిందని పేర్కొన్నారు.

"పెద్ద కుట్ర జ‌రుగుతున్న‌ట్టుంది!! సీఎంని త‌ప్పుగా చూపించ‌డానికి!... వైఎస్ జగన్ గారు మీ కింద ప‌ని‌చేసే కొంత‌మంది మీకు తెలియ‌కుండా చేసే కొన్ని ప‌నుల వ‌ల్ల మీ రెప్యుటేష‌న్ కీ‌,మీ మీద మేం పెట్టుకున్న న‌మ్మ‌కానికి డ్యామేజ్ కలుగుతోంది.వాళ్ల మీద ఓ లుక్కేస్తార‌ని ఆశిస్తున్నాం." రామ్ అని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.