English | Telugu

భారత్ బయోటెక్ కోవాగ్జిన్ తొలి టీకా తీసుకున్న ఆరోగ్య శాఖా మంత్రి..

కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో.. దేశంలో వ్యాక్సిన్ ట్రయల్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ వాక్సిన్ మొదటి రెండు దశల క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయి. తాజాగా కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ దేశ వ్యాప్తంగా మొదలయ్యాయి. ఈ ట్రయల్స్ లో భాగంగా హర్యానా రాష్ట్రం లోని అంబాలా లో కల ఒక ఆస్పత్రిలో స్వయంగా ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి అనిల్ కొవాగ్జిన్ టీకా తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్నా ఈ మూడో దశ ప్రయోగాలు కనుక విజయవంతమైతే అతి త్వరలోనే టీకాను దేశంలోని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.