English | Telugu
సచివాలయం కూల్చివేతపై హైకోర్టు స్టే పొడిగింపు
Updated : Jul 15, 2020
తెలంగాణ సచివాలయ కూల్చివేతపై స్టేను రేపటి వరకు పొడిగించిన హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా కూల్చివేతలు చేపట్టారని, పర్యావరణ అనుమతులు తీసుకోలేదని ప్రోఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరుగుతోంది. వాయుకాలుష్యం పెరిగే అవకాశం ఉన్నందున పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి.. రేపటి లోగా అనుమతులపై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి కోరారు.