English | Telugu
నాలుగో రోజు కూడా నిరాశ చెందిన ధర్మాడి సత్యం బృందం...
Updated : Oct 18, 2019
ఆపరేషన్ రాయల్ వశిష్ట ఆగిపోయినట్టేనా, నీళ్లలో మునిగి పోయిన బోటు వెలికి తీయడం అసాధ్యమా, నాలుగు రోజులు శ్రమించిన ధర్మాణి సత్యం బృందం ఏమీచేయలేకపోయిందా, అవును అనే చెప్పాలి కచ్చులూరులోని పరిస్థితి చూస్తుంటే. బోటు ఆపరేషన్ పై ధర్మాణి సత్యం ప్రాంతం నిరాశపడింది, బోటు కోసం వేసిన ఐరన్ రోప్ లు పైకి రావడంతో సత్యం బృందం షాక్ కు గురైంది. ఇప్పుడు విశాఖ నుంచి దుబాసీల వస్తే తప్ప బోటును వెలికి తీసే అవకాశాలు లేవు అంటోంది ధర్మాడి సత్యం బృందం.
నాలుగో రోజు కూడా ధర్మాడి సత్యం బృందం బోటును వెలికి తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. మూడో రోజు చేసిన ప్రయత్నంలో రోప్ లు బయటకు లాగితే బోటు రెయిలింగ్ మాత్రమే బయటకొచ్చింది బోటు మాత్రం నీళ్ల లోనే ఉండి పోయింది. అయితే గజ ఈతగాళ్లు వచ్చి బోటుకు ఐరన్ రోప్ లు తగిలిస్తే గానీ బోటును బయటకు లాగలేమని చెప్తున్నారు ధర్మాడి సత్యం బృందం. ఈ నేపథ్యంలో దుబాసీలు తమకు సాయం చేయమని కోరగా నది లోపలికి వెళ్ళి బోటుకు తాడు కట్టేందుకు వారు సాహసించలేదు.
ఈ నేపథ్యంలో ధర్మాడి సత్యం బృందం సాంప్రదాయ బధ్ధంగా అదే తరహాలో ఒడ్డుకు లాగుతామని చెప్పారు. మరోవైపు మరైన్ కు సంబంధించిన అధికారులు కూడా అదే పధ్ధతిలో బోటును లాగాలని చెప్పి సత్యం బృందానికి సూచించడంతో అదే తరహాలో ప్రయత్నాలు జరుపుతున్నారు. బోటు బయటకు వచ్చేంతవరకూ ఇదే పధ్ధతి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.