English | Telugu
అనంతపురం కోవిడ్ హాస్పిటల్ లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం...
Updated : Aug 26, 2020
అగ్నిప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అసిస్టెంట్ కలెక్టర్ సూర్య, ఎస్పీ సత్య ఏసుబాబు, స్థానిక ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదం జరిగిన వెంటనే కరోనా బాధితులను మరో వార్డుకు తరలించారు. అయితే ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఎస్పీ, అసిస్టెంట్ కలెక్టర్ తెలిపారు. ఈ ఘటన పై ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఇంకోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.