English | Telugu

ఢిల్లీలో హై అలర్ట్.. మాస్క్ లేకుండా బయటకు వచ్చారా అంతే సంగతి

పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి ఢిల్లీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. నవంబర్ 5వ తేదీ వరకు ఎలాంటి భవన నిర్మాణాలు చేపట్టొద్దని ఆదేశించింది. ఢిల్లీలో అత్యంత ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం చేరడంతో.. ప్రజలు ఇబ్బందులు పడుతూ.. ఇంటి నుంచి బయటకు రావాలంటే కూడా భయపడుతున్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వం మాస్కుల పంపిణీ కార్యక్రమాలు చేపట్టింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చినప్పుడు తప్పని సరిగా ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల ద్వారా యాభై లక్షల మాస్క్లను ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

నిజానికి దీపావళి సందర్భంగా ఫైర్ క్రాకర్స్ అందుబాటులో లేకుండా చాలా వరకు నియంత్రించి కట్టడి చేసినప్పటికి గత ఏడాదితో పోలిస్తే దీపావళీ కారణంగా అయిన కాలుష్యం తగ్గింది కానీ ఇతర కారణాల ప్రభావాల వల్ల పొల్యూషన్ కొనసాగుతునే ఉందని చెప్పవచ్చు. ఢిల్లీ వాయు కాలుష్యం ప్రతి ఏడాది చలి కాలం మొదలైందంటే చాలు ఈ తరహాలోనే వాయు కాలుష్యం అనేది ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఎందుకంటే ఇది కేవలం ఢిల్లీ స్థాయిలో అవుతున్న కాలుష్యం మాత్రమే కాదు బయట రాష్ట్రాల ప్రభావం కూడా ఉంది. ముఖ్యంగా హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను యథేచ్చగా కాల్చి పడేయటం వల్ల ఈ కాలుష్యం మరింత ఎక్కువ అవుతుంది. మొత్తానికి ఢిల్లీలో అయితే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. కాలుష్యం తగ్గించడానికి ప్రజలు సహకరించాలని కోరుతున్నారు.