ఆంధ్ర ప్రదేశ్ రాజభవన్ లోని చీఫ్ సెక్యురిటి ఆఫీసర్, వైద్య సహాయకుడు, పని మనిషి, హౌస్ కీపింగ్ సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. గవర్నర్ కి సైతం వైద్య పరీక్షలు నిర్వహించారు. విజయవాడలో ఆదివారం సుమారు 30కేసులు నమోదు అయ్యాయి. కృష్ణలంకలో 3, మాచవరంలో 2, రైల్వే ఆస్పత్రిలో 2 నమోదు కాగా, మాచవరం పీఎస్ లో నాలుగు, నున్నలో ఒకటి, సైబర్ సెల్ ఎస్సై లకు పాజిటివ్ నిర్ధారణ అయింది.