English | Telugu

ఇద్ద‌రు మిన‌హా మృతులంతా ఢిల్లీ వెళ్లొచ్చిన వారే!

మర్కజ్‌కు హాజరైన వారికి కరోనా వైరస్‌ సోకడంతో వాతావరణం ఒక్కసారిగా మారింది. గడిచిన నాలుగురోజుల్లో సంభవించిన మరణాల్లో ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారే. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన 11 మరణాల్లో ఇద్దరు మినహా మిగతావారంతా ఢిల్లీ మ‌ర్క‌జ్ కి వెళ్లివచ్చిన వారేకావడం పరిస్థితి తీవ్రతకు అర్థం పడతోంది.

తెలంగాణలో ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారు 1,030 మంది ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ ఇంతకుముందే ప్రకటించింది. వారిలో దాదాపు 900 మందిని ఇప్పటివరకు గుర్తించి తమ అధీనంలోకి తీసుకున్నారు. వారి కుటుంబసభ్యులను, వారితో కాంటాక్ట్‌ అయినవారిని కూడా కొందరిని గుర్తించారు. శుక్రవారం పరీక్షల్లో 75 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం సంఖ్య 229కి చేరింది. ఇప్పటి వరకు 11 కు చేరుకున్న కరోనా పాజిటివ్ మృతులు. జిల్లాల వారీగా నిజాముద్దీన్ కు వెళ్లి వచ్చిన వారి సంఖ్య ఇలా ఉంది.

హైద్రాబాద్- 603, ఆదిలాబాద్-30, కొత్తగూడెం -11, జగిత్యాల-25, జనగామ- 4, భూపాలపల్లి- 1, గద్వాల -5, కరీంనగర్ -17, ఖమ్మం -27, మహబూబాబాద్- 6, మహబూబ్ నగర్- 11, మంచిర్యాల- 10, మెదక్ -2, మేడ్చల్ -2, ములుగు- 2, నాగర్ కర్నూల్- 4, నల్గొండ -45, నిర్మల్ 25, నిజామాబాద్- 80, పెద్దపల్లి- 6, సిరిసిల్ల- 9, రంగారెడ్డి- 13, సంగారెడ్డి- 22, సూర్యాపేట- 3, వనపర్తి- 3, వికారాబాద్- 7, వరంగల్ రూరల్- 1, వరంగల్ అర్బన్- 38, యాదాద్రి భువనగిరి- 4.