English | Telugu

ప్రమాదాలకు అడ్డాగా బయోడైవర్సిటీ ఫ్లైఓవర్.. కారు పడి మహిళ మృతి!

హైదరాబాదులోని గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ వద్ద ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న ఓ కారు అదుపుతప్పి ఫ్లైఓవర్ పై నుంచి ఒక్కసారిగా కిందపడింది. ఫ్లై ఓవర్ కింద నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళ కారు కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. అంతేకాదు.. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులతో సహా దాదాపు 8 మంది వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

ఫ్లైఓవర్‌పై మలుపు దగ్గర స్పీడ్ కంట్రోల్ కాకపోవటంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఫ్లై ఓవర్ ను ప్రారంభించి నెల రోజులు కూడా గడవక ముందే.. ఇది మూడో ప్రమాదం కావడం గమనార్హం. ఫ్లైఓవర్‌ డిజైన్‌లో లోపం, చాలా మలుపులు ఉండటంతో ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి ప్రయోజనం చేకూర్చడం కోసం.. ఫ్లైఓవర్ డిజైన్‌లో హడావుడిగా మార్పులు చేసి నిర్మించడం వల్ల.. నిర్మాణంలో లోపాలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.