English | Telugu

సుప్రీంకోర్టుకు కొత్త న్యాయమూర్తి :- పదవి ప్రమాణం చేసిన అరవింద్ బాబ్డే

భారత అత్యున్నత ప్రధాన న్యాయమూర్తిగా శరద్ అర్వింద్ బాబ్డే ఇవాళ పదవీ ప్రమాణం చేశారు. అరవై మూడేళ్ల బాబ్డే మహారాష్ట్రకు చెందిన న్యాయమూర్తి.ఆయన సుప్రీం కోర్టుకు 47వ చీఫ్ జస్టిస్ కానున్నారు. 17 నెలల పాటు అంటే 2021 ఏప్రిల్ 23 వరకు బాబ్డే భారత ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందిస్తారు. న్యాయకోవిదునిగా పేరు పొందిన బాబ్డే పలు కీలక కేసులో చరిత్రాత్మక తీర్పునిచ్చారు. ఇటీవల అయోధ్య కేసులో తీర్పు చెప్పిన ఐదుగురు న్యాయమూర్తుల్లో ఆయన కూడా ఉన్నారు. గత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న రంజన్ గోగోయ్ పదవీ విరమణతో బాబ్డేకు అవకాశం వచ్చింది.1956 ఏప్రిల్ 24న బాబ్డే జన్మించారు.

నాగ్ పూర్ లో పుట్టిన ఆయన అక్కడే విద్యాభ్యాసం కొనసాగించారు. లా చదివిన తర్వాత నాగ్ పూర్ లోనే ప్రాక్టీస్ చేశారు. సుప్రీం కోర్టుకు వెళ్లి కొన్ని కేసులు వాదించారు. 2000 సంవత్సరంలో ఆయన బాంబే హై కోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. రెండు వేల పన్నెండులో మధ్యప్రదేశ్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2013 లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా చేరారు. అనేక కీలక కేసులో జనం మెచ్చుకునే తీర్పు చెప్పిన తర్వాత ఇప్పుడు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కానున్నారు.