English | Telugu
సీఎంకు బాలాపూర్ లడ్డు
Updated : Sep 3, 2020
హైదరాబాద్ గణేష్ ఉత్సవాల్లో అత్యంత పేరున్న బాలాపూర్ లడ్డూను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుకు బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ అందించింది. ఈ సందర్భంగా కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ 11రోజులు గణేష్ పూజలు నిర్వహించిన ఉత్సవ కమిటీని ముఖ్యమంత్రి అభినందించారు. దాదాపు 25 ఏండ్లుగా బాలాపూర్ లడ్డును వేలం వేస్తున్నారు. అయితే కరోనా సందర్భంగా ఈ ఏడాది వేలం పాటను రద్దు చేశారు. 1994లో మొదటిసారి ఈ లడ్డును 450రూపాయలకు వేలం వేయగా గత ఏడాది ఈ లడ్డు ధర 17 లక్షల 60వేల రూపాయలు పలికింది.