English | Telugu
హుక్కా సెంటర్లో బర్త్ డే సెలబ్రేషన్స్... హుక్కా పీలుస్తూ పట్టుబడ్డ 20 మంది మైనర్ బాలికలు
Updated : Sep 4, 2020
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలోని టిటి నగర్ ప్రాంతంలో జోహ్రీ హోటల్‌లోని హుక్కా లాంజ్‌లో ఒక బర్త్ డే పార్టీ జరుగుండగా సడెన్ గా పోలీసులు దాడులు చేశారు. ఈ దాడులలో అక్కడ 20 మంది మైనర్ బాలికలు ఉన్నట్లుగా తేలింది. అక్కడ మైనర్లకు హుక్కాతో పాటు కొన్ని నిషేధిత మాదక ద్రవ్యాలు కూడా నిర్వాహకులు అందుబాటులో ఉంచినట్లుగా పోలీసులు గుర్తించారు. ఫోరెన్సిక్ దర్యాప్తు అనంతరమే అసలు విషయం బయటపడుతుందని పోలీసులు పేర్కొంటున్నారు.
20 మంది మైనర్ బాలికలతో పాటు, 10 మంది బాలురిని పోలీసులు అదుపులోకి తీసుకుని చైల్డ్ లైన్ మరియు స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్ కు అప్పగించారు. ఈ మైనర్లందరూ బర్త్ని డే పార్టీ సాకుగా చేసుకొని హుక్కా బార్ లో కలిశారని పోలీసులు తెలిపారు. అయితే హోటల్ నిర్వాహకులు పరారీలో ఉన్నారని.. వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.