English | Telugu

అమర్ నాథ్ యాత్ర రద్దు

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే అమర్ నాథ్ యాత్ర ఈ ఏడాదికి రద్దు అయ్యింది. ఈనెల 21 నుంచి యాత్ర ప్రారంభం అవుతుందని ముందుగా ప్రకటించినప్పటికీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో యాత్రను రద్దు చేసినట్లు అమర్ నాథ్ దేవస్థానం బోర్టు స్పష్టం చేసింది. కరోనా ప్రభావం, దేశ సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధవాతావరణం నేపధ్యంలో ఈ ఏడాదికి అమర్ నాథ్ యాత్రను రద్దు చేసి భక్తులకు లైవ్ టెలీకాస్ట్ ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు.

కరోనా వ్యాప్తి కారణంగా అమర్‌నాథ్ యాత్రకు అనుమతించే అంశంపై అనేక పర్యాయాలు చర్చలు జరిగాయి. చివరికి యాత్రను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీం కోర్టు వరకు ఈ విషయం వెళ్ళింది. 15 రోజులకు యాత్రను కుదించారు. ఈ నెల 21 నుంచి యాత్ర ప్రారంభమవుతుందని ప్రకటించారు. చివరికి భక్తులను ఊరిస్తూ వచ్చిన అమర్‌నాథుడి దర్శనం వచ్చే ఏడాదికి వాయిదా పడింది. గత సంవత్సరం కూడా అమర్ నాథ్ యాత్ర మధ్యలోనే రద్దు చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్ములో నెలకొన్న ఉద్రికత్త పరిస్థితుల కారణంగా రద్దు చేశారు.