English | Telugu
రైతుల మేలు కోసమే కొత్త చట్టాలు- ప్రధాని మోడీ
Updated : Dec 12, 2020
కొత్త చట్టాలతో రైతులు తామ పండించిన పంటలను మార్కెట్లు లేదా బయట ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు ఉందని ప్రధాని మోడీ చెప్పారు. రైతులకు ఉపయోగపడేలా దేశ వ్యాప్తంగా కోల్డ్ స్టోరేజీలను ఆధునికీకరిస్తామని తెలిపారు. కొత్త సాగు చట్టాలతో భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెరుగుతాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతుల ఆదాయాన్ని పెంచి.. వారి జీవితాల్ని మరింత సుభిక్షంగా మార్చాలన్న ఉద్దేశంతోనే కొత్త చట్టాల్ని తీసుకొచ్చామని ప్రధాని మోడీ మరోసారి స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు.
మరోవైపు రైతుల ఆందోళనలు 17వ రోజుకు చేరాయి. దీంతో ఢిల్లీ సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతుల సంఘాల ప్రతినిధులను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు పిలిచింది. ఉద్యమాన్ని విరమించి సంప్రదింపులకు రావాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విజ్ఞప్తి చేశారు. అయితే కొత్త చట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రకటిస్తే తప్ప తాము ఉద్యమాన్ని ఆపేది లేదని రైతు సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు.