English | Telugu
జగన్ సర్కార్ కు బిగ్ షాక్.. మూడు రాజధానులపై హైకోర్టు స్టే
Updated : Aug 4, 2020
ఏపీలో 3 రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్రవేయడాన్ని సవాల్ చేస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి కోర్టులో సోమవారం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రాజధాని వికేంద్రీకరణ పై జీఎన్ రావు, హైపవర్ కమిటీ చట్ట విరుద్ధమని ప్రకటించాలని పిటిషనర్ కోర్టును కోరారు. రాజ్ భవన్, సీఎం కార్యాలయం, సచివాలయాలను అమరావతి నుంచి తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు గవర్నర్ జారీ చేసిన గెజిట్‌పై స్టేటస్ కో విధించింది.