English | Telugu
ఏపీలో బూట్ల కొలతల కోసం బడికి.. పిల్లల ప్రాణాలతో చెలగాటం!
Updated : Jun 9, 2020
జగనన్న విద్యా కానుక లో భాగంగా ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు బూట్లు ఇవ్వనున్న సంగతి తెలిసిందే. బూట్ల పంపిణీ చేయడానికి విద్యార్థులను స్కూళ్లకు రప్పించి పాదాల కొలతలు తీసుకోవాలంటూ ఇటీవల ఉత్తర్వులిచ్చారు. కరోనా కారణంగా స్కూళ్లు తెరవక పోయినా.. బూట్ల కొలత కోసం విద్యార్థులను పిలిపించారు. కొలతలు ఇవ్వడానికి విద్యార్థులంతా స్కూళ్లకు క్యూ కట్టారు. ఉపాధ్యాయులుపాదాల కొలతలను తీసుకుంటున్నారు. అయితే, కరోనా విజృంభిస్తోన్న వేళ.. ఇలా విద్యార్థులను గుంపులుగా స్కూళ్లకు రప్పించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.