తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. కొన్ని రోజులుగా కారు పార్టీకి కమలం పార్టీ షాకులు ఇస్తుండగా.. ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఝలక్ ఇచ్చింది. ఆదిబాట్ల మున్సిపల్ చైర్మన్ కొత్త ఆర్ధిక అధికార పార్టీకి హ్యాండిచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరింది. భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలోని ఉంది కొత్త ఆర్ధిక. మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే పోటీ చేసి విజయం సాధించారు. అయితే మున్సిపల్ చైర్మెన్ సీటును అధికార పార్టీ ఆఫర్ చేయడంతో ఆమె రాత్రికి రాత్రే గులాబీ పార్టీలో చేరిపోయారు. ఆదిబట్ల మున్సిపాలిటీగా తొలి చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు.
అధికార పార్టీలో చేరి ఆదిబట్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన ఆమె మొదటి నుంచి సంతృప్తిగా లేదని తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యేనే పూర్తి పెత్తనం చలాయిస్తుండటంతో తాను విదులు నిర్వహించలోకపోతున్నానని ఇటీవల ఆమె బహిరంగంగానే కామెంట్ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఆమె చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. ఇంతలోనే టీఆర్ఎస్ కు గుజ్ బై చెప్పి సొంత పార్టీలో చేరిపోయారు కొత్త ఆర్ధిక. ఆదిబట్ల మున్సిపల్ చైర్ పర్సన్ కాంగ్రెస్ లో చేరడంతో రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ నేతలు షాకవుతున్నారు.