English | Telugu
మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త...
Updated : Oct 3, 2019
మార్కెట్ కమిటీ చైర్మన్ లలో సగం మహిళలకే ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. కమిటీలో కూడా సగం మహిళలకే కేటాయించేటట్టుగా అనుమతి తీసుకుంటున్నారు, అక్టోబర్ చివరి నాటికి భర్తీ చేసేలా చొరవ తీసుకుంటారు. ఇప్పటికే జారీ అయిన జీవో ప్రకారం ఎస్సీ , ఎస్టీ, బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ లకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలిచ్చారు. పంటలు వేసినప్పుడే వాటికి ధరలు ప్రకటించాలని కూడా సీఎం జగన్ స్పష్టం చేశారు. అలాగే ఆరు నెలల్లోగా దళారీ వ్యవస్థను నిర్మూలించాలని, కనీస మద్దతు ధరలు లేని పంటలకు ధరలు ప్రకటించాలని సూచించారు. మార్కెటింగ్ సహకార శాఖల పై ముఖ్యమంత్రి జగన్ ఇవాళ సమీక్ష చేశారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అలాగే రైతాంగానికి సంబంధించి ఉపయోగపడేటువంటి అంశాల మీద ఆయా ప్రాంతాల్లో రైతులు వేస్తున్న పంటలకు సంబంధించి గిట్టుబాటు ధరలను కల్పించే విషయంలో రైతును ఆదుకునే విషయంలో రైతన్నకు ప్రభుత్వానికి మధ్యలో మరీ ప్రజాప్రతినిధుల జోక్యంతో నిరంతరం మానిటరింగ్ జరగాలన్న ఆలోచనతోటి, రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి అగ్రికల్చర్ మార్కెటింగ్ యాడ్స్ అన్నిటికి కూడాను ముఖ్యమంత్రి గారు గతంలో ఏదైతే హామీ ఇచ్చారో, ప్రభుత్వ నిర్ణయం మేరకు నామినేట్ చేపడుతున్నటువంటి ప్రతి పోస్టులో కూడాను రిజర్వేషన్ ప్రక్రియను కొనసాగిస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగిందని వైసిపి నాయకుడు తెలిపాడు. ఇచ్చిన హామీ మేరకే రేపటి రోజు నుంచి నియమాకం సిద్ధం కాబోతున్నటటువంటి మార్కెటింగ్ అన్ని యార్డుల్లో కూడాను యాభై శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల రిజర్వేషన్ ప్రక్రియ అమలు చేయటానికి అవసరమైన వివిధ అన్ని నిర్ణయాలు కూడా తీసుకోవటం జరిగిందని ఆయన తెలిపారు. మొత్తం మీద ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రధానంగా రైతు, వ్యవసాయ కూలీ సుఖసంతోషాలతో ఉండాలంటే అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి సందేశాన్ని తెలియజేశారని ఆయన పేర్కొన్నారు.