English | Telugu
అక్కడ ఊరందరికీ కరోనా.. కానీ ఒకే ఒక్కడు క్వారంటైన్ లో..
Updated : Nov 19, 2020
మొత్తం గ్రామంలోని అందరికీ కరోనా పాజిటివ్ వచ్చినా, భూషన్‌కు మాత్రం నెగిటివ్ రావడం చాల మందికి విచిత్రంగా అనిపించిందన్నారు. మొదట్లో గ్రామానికి చెందిన ఐదుగురు కరోనా పాజిటివ్ గా తేలారని, దీంతో గ్రామంలోని వారంతా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా కరోనా టెస్టులు చేయించుకున్నారన్నారు. ఈ గ్రామంలో మొత్తం జనాభా 100 మంది కాగా.. ప్రస్తుతం అక్కడ మంచు కురుస్తున్న కారణంగా కొంతమంది కూలూ ప్రాంతానికి తరలి వెళ్లిపోయారని అన్నారు. ఇది ఇలా ఉండగా కరోనా సోకని భూషన్ తన ఇంటిలోని వారికి దూరంగా ఒక గదిలో ఒక్కడే ఉంటూ.. స్వయంగా వంట వండుకుంటున్నాడు. కుటుంబ సభ్యులతో పాటు భూషన్ కూడా కరోనా టెస్టు చేయించుకోగా.. అతనికి నెగిటివ్ రిపోర్టు వచ్చింది. కరోనాను ఎంత మాత్రం తేలికగా తీసుకోవద్దని, మాస్క్ ధరించడంతో పాటు శానిటైజ్ చేసుకోవడం మరచిపోకూడదని ఈ సందర్భంగా భూషన్ స్పష్టం చేస్తున్నాడు.