English | Telugu

అనంతపురం వైరల్ రీసెర్చ్ డయాగ్నోస్టిక్ లేబరేటరీ కి అందిన 24శాంపిల్స్

అనంతపురం మెడికల్ కళాశాలలో కరోనా వైరస్ డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడానికి వైరల్ రీసెర్చ్ డయాగ్నస్టిక్ లేబరేటరీ కి శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు 24 శాంపిల్స్ అందాయని ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నీరజా మైరెడ్డి తెలిపారు. అందులో కర్నూలు జిల్లా నుండి ఉదయం 10 గంటల లోపు ఒక శాంపిల్, అనంతపురం జిల్లా నుండి సాయంత్రం ఐదు గంటల లోపు 23 శాంపిల్స్ అందాయన్నారు. అనంతపురం జిల్లాకు సంబంధించి హిందూపురం నుండి20 శాంపిల్స్ , అనంతపురం ప్రధాన కేంద్రము నుండి 3 శాంపిల్స్ వచ్చాయని ఆమె తెలిపారు.
ఈనెల 24వ తేదీ నుండి ఈనాటి వరకు(27వ తేదీ) మొత్తం 45 శాంపిల్స్ అందాయన్నారు. ఇందులో కర్నూలు జిల్లా నుండి 24వ తేదీన 11 శాంపిల్స్, 25వ తేదీన 2, 26వ తేదీన ఒక శాంపిల్ ,27 వ తేదీన ఒక శాంపిల్ అందగా, అనంతపురం జిల్లా నుండి 24వ తేదీన రెండు శాంపిల్స్, 25వ తేదీన 2 శాంపిల్స్, 26వ తేదీన మూడు శాంపిల్స్,27 వ తేదీన 23 శాంపిల్స్ పరీక్షల నిమిత్తం అనంతపురం మెడికల్ కళాశాలలో ని వైరల్ రీసెర్చ్ డయాగ్నస్టిక్ లేబరేటరీ కి వచ్చిందన్నారు.