English | Telugu

103 ఏళ్ల బామ్మ కరోనాను ఓడించింది!

ఇటలీకి చెందిన ఈ బామ్మ ఆత్మ విశ్వాసంతో కోలుకుంది. ధైర్యం, విశ్వాసంతోనే కరోనా మహమ్మారిపై విజయం సాధ్యమని 103 ఏళ్ల బామ్మ నిరూపించింది. కొవిడ్‌-19 కారణంగా మృత్యు ముఖం దాకా వెళ్లిన జ్వరంతో వారం రోజుల పాటు మంచానికే పరిమితమైన అడా జానుస్సో అనే వృద్ధురాలు మృత్యువుతో పోరాడి గెలిచింది. క‌రోనాను ఓడించింది. జ్వ‌రంతో తీవ్ర‌త కార‌ణంగా ఆమె ఎలాంటి ఆహారం తీసుకోలేకపోయింది. దీంతో డాక్టర్లు ఆమెకు ద్రవాహారం అందించారు.

తరచూ మగతలోకి వెళ్లిపోయే ఆమె ద్రవాహారాన్ని సైతం సరిగ్గా తీసుకోలేకపోవడంతో ఆమెకు చికిత్స అందించే డాక్ట‌ర్లు కూడా ఆశలు వదులుకున్నార‌ట‌.

అయితే వారం రోజుల తర్వాత అకస్మాత్తుగా బామ్మ కళ్లు తెరిచి యాక్టివ్ అయిపోయింది. జానుస్సో బెడ్‌పై కూర్చోవ‌డం, ఆ త‌రువాత కిందికి దిగి నడవడంతో వైద్య సిబ్బంది సంతోషంతో ఆమెకు శుభాకాంక్ష‌లు తెలిపారు. ‘నీవు ఎలా కోలుకున్నావు’ అని వైద్యుడు ప్రశ్నించగా, ధైర్యం, బలం, విశ్వాసం వల్లేనని వృద్ధురాలు సమాధానమిచ్చిందట‌!