English | Telugu

త్వరలో వీళ్ళ పెళ్లి నిజమేనా...?

త్వరలోనే విశాల్, వరలక్ష్మీ లు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై ఎవరు కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో అందరు నిజమే అని అనుకుంటున్నారు. కానీ త్వరలో వీళ్ళిద్దరూ ఒకటవబోతున్నారని మళ్ళీ కోలీవుడ్ కోడై కూస్తుంది. తాజాగా వీళ్ళిద్దరూ కూడా సీసీఎల్ మ్యాచ్ లో కలిసి ఆటను ఎంజాయ్ చేయడంపై ఈ వార్తలు నిజమేనని అనుకుంటున్నారు. వీరిపెళ్ళికి శరత్ కుమార్ భార్య రాధిక అప్పట్లో మధ్యవర్తిగా కూడా ఉందని వార్తలు వచ్చాయి. మరి వీరి పెళ్లి వార్తలు నిజమో కాదో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.