Read more!

English | Telugu

'వకీల్ సాబ్' డైరెక్టర్ తో అఖిల్ అక్కినేని!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్'(2021)తో మెప్పించిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఏడాది దాటినా ఇంతవరకు తన కొత్త సినిమాని ప్రకటించలేదు. అయితే ఎట్టకేలకు వేణు శ్రీరామ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఓకే అయిందని, ఇందులో అక్కినేని యువ హీరో అఖిల్ నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది.

అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతోన్న ఈ మూవీ ఆగష్టు 12న విడుదల కానుంది. 'ఏజెంట్' తర్వాత అఖిల్ చేయబోయే సినిమా ఏంటి అనే దానిపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'తో తనకు ఫస్ట్ హిట్ ఇచ్చిన బొమ్మరిల్లు భాస్కర్ తో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు ఇటీవల న్యూస్ వినిపించింది. అయితే ఇప్పుడు వేణు శ్రీరామ్ పేరు తెరపైకి వచ్చింది.

ఇప్పటికే వేణు శ్రీరామ్ కథ వినిపించగా, అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నాడని సమాచారం. ఇప్పటిదాకా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఓ మై ఫ్రెండ్', 'MCA', 'వకీల్ సాబ్' సినిమాలు రాగా.. ఈ మూడు సినిమాలనూ దిల్ రాజే నిర్మించడం విశేషం.