English | Telugu
రాజమౌళి దర్శకత్వంలో వరుణ్ తేజ్
Updated : Mar 19, 2011
ఈ విషయమై నాగేంద్ర బాబు స్వయంగా రాజమౌళితో మాట్లాడి తన కుమారుడు హీరోగా నటించబోయే తొలి చిత్రానికి రాజమావళిని దర్శకత్వం వహించవలసిందిగా కోరాడని ఫిలిం నగర్ వర్గాల ద్వారా సమాచారం. తన అన్నగారి కుమారుడు రామ్ చరణ్ తేజకు "మగధీర" వంటి ఆల్ టైమ్ హిట్టిచ్చిన రాజమౌళి దర్శకత్వం వహిస్తే, వరుణ్ తేజ్ హీరోగా రాణిస్తాడని నాగబాబు ఉద్దేశ్యంగా తెలుస్తోంది.
మెగా ఫ్యామిలీలో సహజంగా ఇలాంటి విషయాల్లో చక్రం తిప్పే అల్లు అరవింద్ ప్రమేయం లేకుండా నాగబాబే ఈ విషయాన్ని చూసుకోవటం, మెగా ఫ్యామిలీలో అల్లు అరవింద్ ప్రాభవం తగ్గిందనే అనుమానాలకు తావిస్తోంది.