English | Telugu
‘ఓజీ’లో కొత్త పాట యాడ్ చేస్తున్నారు.. ఎప్పట్నుంచి అంటే..?
Updated : Sep 27, 2025
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ ‘ఓజీ’ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఈ కలెక్షన్స్‌ను మరింత పెంచేందుకు మేకర్స్ కొత్త ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. సినిమా రిలీజ్‌కి ముందు నేహాశెట్టితో స్పెషల్ సాంగ్ ఉంటుందని ప్రచారం జరిగింది. నేహాశెట్టి తను ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేశానని స్వయంగా చెప్పుకున్నారు. అది ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతోందని ఒక జ్యూయలరీ షాప్ ఓపెనింగ్‌కి వచ్చినపుడు చెప్పింది.
ఈ స్పెషల్ సాంగ్ గురించి సుజిత్ దగ్గర ప్రస్తావించినపుడు ‘స్పెషల్ సాంగ్ గురించి మేం ఎనౌన్స్‌మెంట్ ఏమీ చెయ్యలేదు కదా’ అన్నారు. దీంతో ప్రేక్షకుల్లో కొంత అయోమయ పరిస్థితి ఏర్పడిరది. స్పెషల్ సాంగ్ చెయ్యకపోతే నేహా చెప్పదు కదా! అనే సందేహం కూడా ప్రేక్షకుల్లో కలిగింది. క్రియేటివ్ డైరెక్టర్ అశ్విన్ మణి ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు స్పెషల్ సాంగ్‌కి సంబంధించినవే అని కన్‌ఫర్మ్ చేశాయి. కానీ, సుజిత్ మాత్రం దాన్ని ఖండిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇన్‌సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ‘ఓజీ’ కోసం కొత్త పాటను రెడీ చేశారు. థియేటర్లకు వచ్చే ఆడియన్స్ సంఖ్యను పెంచేందుకు సినిమాలో ఆ పాటను యాడ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆదివారం నుంచే ఈ పాట సినిమాలో ఉంటుందని సమాచారం. అయితే ఆ పాట ప్లేస్‌మెంట్ ఏమిటి అనేది ఇంకా తెలియలేదు. ఈ పాటకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంతవరకు రాలేదు. దీన్నిబట్టి నిజంగా స్పెషల్ సాంగ్ ఉందా.. లేక బయట వినిపిస్తున్న మాటలేనా అనేది తెలియాల్సి ఉంది.