Read more!

English | Telugu

గబ్బర్‌సింగ్ చేతిలో గాలిపటం

 
చోటా, బడా సినిమా అయినా, విషయం అయినా దానికి పవణ్ కళ్యాణ్ పేరు జోడిస్తే పాపులారిటీ ఉన్నపలాన వచ్చేస్తుందని అందరికీ అర్థమయినట్లు వుంది. ఆ విషయం అర్థమయి కాబోలు గబ్బర్ సింగ్-2 దర్శకుడు సంపత్ నంది తన సొంత సినిమా గాలిపటం లోగో ఆవిష్కరణకు పవన్‌ని ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నాడు. 
యంగ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ సంపత్ నంది పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్-2 కు దర్శకత్వం చేసే లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. అంతకు ముందు ఏమైంది ఈ వేళ, రచ్చ సినిమాల సక్సెస్‌తో యంగ్ డైరెక్టర్ సంపత్ నంది ఈ అవకాశం దక్కించుకున్నాడు. అయితే యంగ్ డైరెక్టర్లు ఈ మధ్య నిర్మాతలుగా కూడా మారుతుండటం ఇప్పటి ట్రెండ్ అని చెప్పొచ్చు. సంపత్ కూడా అలా నిర్మాతగా మారి గాలిపటం అనే చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టైటిల్ లోగో ఆవిష్కరణ జరపాలని టీం ఆలోచిస్తోంది. దానికి పవన్ కళ్యాణ్‌ని ముఖ్యఅతిథిగా పిలిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం.