English | Telugu
యన్ టి ఆర్ హీరోగా లారెన్స్ భారీ చిత్రం
Updated : Dec 17, 2011
యన్ టి ఆర్ హీరోగా లారెన్స్ భారీ చిత్రం తీయనున్నాడని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కమ్ హీరో కూడా అయిన రాఘవ లారెన్స్ త్వరలో యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా ఒక చిత్రానికి దర్శకత్వం చేయనున్నాడట. "ముని" చిత్రానికి సీక్వెల్ గా లారెన్స్ ఇటీవల తీసిన "కాంచన" చిత్రం మంచి జనాదరణ పొందింది. అలాంటి లారెన్స్ ఈ మధ్య యన్ టి ఆర్ కి ఒక కథ చెప్పగా అది నచ్చిన యన్ టి ఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
యన్ టి ఆర్ ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో, కె.యస్.రామారావు నిర్మిస్తున్న "దమ్ము" చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించిన అనంతరం లారెన్స్ దర్శకత్వంలోని సినిమా ఉంటుందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి.