English | Telugu

పూజా హెగ్డేకి వ‌దిన‌గా న‌య‌నతార‌!?

సీనియ‌ర్ స్టార్ విక్ట‌రీ వెంక‌టేశ్ స‌ర‌స‌న క‌నువిందు చేసిన క‌థానాయిక‌ల్లో లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ఒక‌రు. వెంకీ, న‌య‌న్ జంట‌గా ఇప్ప‌టివ‌ర‌కు `ల‌క్ష్మీ` (2006), `తుల‌సి` (2007), `బాబు బంగారం` (2016) చిత్రాలు రాగా.. వాటిలో `ల‌క్ష్మీ`, `తుల‌సి` విజ‌య‌ప‌థంలో ప‌య‌నించాయి. క‌ట్ చేస్తే.. ఆరేళ్ళ విరామం అనంత‌రం ఈ ఇద్ద‌రు మ‌రోమారు జ‌ట్టుక‌ట్ట‌నున్నార‌ని స‌మాచారం.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్, `బుట్ట‌బొమ్మ‌` పూజా హెగ్డే జోడీగా ప‌ర్హాద్ సామ్జీ ద‌ర్శ‌క‌త్వంలో `క‌బీ ఈద్ క‌బీ దీవాళి` పేరుతో హిందీనాట ఓ ఫ్యామిలీ డ్రామా తెర‌కెక్కుతున్న విష‌యం విదిత‌మే. కాగా, ఇందులో వెంక‌టేశ్ ఓ ముఖ్య పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. పూజా హెగ్డేకి అన్నగా ఆయ‌న క‌నిపిస్తార‌ని బ‌జ్. ఇక ఇదే సినిమాలో వెంకీకి జంట‌గా, పూజ‌కి వ‌దిన‌గా న‌య‌న్ ని న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట మేక‌ర్స్. అదే గ‌నుక నిజ‌మైతే.. న‌య‌న్ కి ఇది హిందీలో రెండో చిత్ర‌మ‌వుతుంది. ప్ర‌స్తుతం షారూక్ ఖాన్ హీరోగా కోలీవుడ్ కెప్టెన్ అట్లీ తీర్చిదిద్దుతున్న సినిమాతో న‌య‌న్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో షారూక్ కి ల‌వ్ ఇంట్ర‌స్ట్ గా న‌య‌న్ ఎంట‌ర్టైన్ చేయ‌నుంది. త్వ‌ర‌లోనే స‌ల్మాన్ - వెంకీ చిత్రంలో న‌య‌న్ ఎంట్రీపై క్లారిటీ రానున్న‌ది. మ‌రి.. వెంకీ, న‌య‌న్ జంట బాలీవుడ్ లోనూ అల‌రిస్తుందేమో చూడాలి.