Read more!

English | Telugu

అప్సెట్ అయిన నమిత అభిమానులు


 

తమిళనాట అభిమానులు గుడి కట్టి మరీ ఆరాధించే హీరోయిన్లలో ఒకరు నమిత. నమిత అభిమానుల గురించిన వార్తలు అప్పుడప్పడు ఆశ్చర్యపరుస్తుంటాయి. సినిమాలలో నమిత ఇప్పుడు ఎక్కువగా కనిపించకపోయినా అడపాదడపా తమిళనాడులో పబ్లిక్ అప్పియరెన్సులు మాత్రం ఇస్తోంది. ఈ మధ్య అలా ఆమె వెళ్లిన ఒక నాటక కార్యక్రమంలో అభిమానుల హడావిడి ఎక్కువై స్టేజి కూలిపోయింది. ప్రమాదంలో నమితకు ఏం కాకపోయినా మూడు అంబులెన్సులు మాత్రం ఆమె సహాయార్ధం వచ్చి నిలిచాయి.

 ఇదలా వుంచితే తాజాగా తమిళనాడు నామక్కల్‌లో నమితతో ఆటపాట  మీలో ఎవరు లారెన్స్ అనే ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. నమిత అనే సరికి వేలాదిగా జనం ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి హాజరయ్యారు. రాత్రి 8 గంటలకు కార్యక్రమం మొదలైనా, 10 గంటలవరకు నమిత జాడలేదు. చివరకు హెల్త్ అప్సెట్ అయి ఆమె రాలేకపోతోందని అనౌన్స్ చేశారు నిర్వాహకులు. దీంతో అభిమానులు కూడా బాగా అప్సెట్ అయి నానా రభస చేశారట. అంతే కాదు ఇది పచ్చి మోసం అంటూ పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారట కార్యక్రమానికి వచ్చినవారు.